Home TV SHOWS Bigg Boss 4.. నవ్వుల వెనుక విషాదం.. బ్రేకప్‌పై అవినాష్ ఎమోషనల్ కామెంట్స్

Bigg Boss 4.. నవ్వుల వెనుక విషాదం.. బ్రేకప్‌పై అవినాష్ ఎమోషనల్ కామెంట్స్

బిగ్ బాస్ షోలో ఎన్నో ఎమోషన్స్ బయటపడుతుంటాయి. అందులోకి వెళ్లాక పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు. ప్రతీ ఒక్కరి జీవితం తెరిచిన పుస్తకమే అవుతుంది. ఏదో ఒక సందర్భంలో జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన గురించి ఎవరో దగ్గరో చెప్పుకుంటారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు. అలాంటి వాటినే బిగ్ బాస్ టీం ప్రత్యేకంగా ప్రసారం చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో అలా అవినాష్ తన మనసులోని మాటను చెప్పేశాడు.

Bigg Boss 4 Telugu Avinash Breakup Story With Ariyana
Bigg Boss 4 Telugu Avinash Breakup Story with Ariyana

మామూలుగానే అవినాష్ తన ఎంట్రీ ప్రోమోలో ఎన్నో సంగతులు చెప్పాడు. జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నాడు.. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు.. చిన్నతనంలో చదువు ఎలా సాగింది.. ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తే ఎలా వదిలేసి వెళ్లిందో అంటూ చెబుతూ అందర్నీ కంటతడి పెట్టించాడు. అయితే అవినాష్ లవ్ స్టోరీ మాత్రం విషాదాంతం కావడం అతని మనసులో బలంగా నాటుకుపోయినట్టు కనిపిస్తోంది.

స్కూల్ ఏజ్‌లో మొదలైన లవ్ కాబట్టి అవినాష్ బాగా కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. చిన్నతనం నుంచి ఆ అమ్మాయినే ప్రేమించాడట. అవినాష్ లవ్ స్టోరీ గురించి అతని తమ్ముడు అజయ్ చెప్పిన విషయాలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. అయితే బ్రేకప్ అయ్యాకే అన్నయ్య కెరీర్ మీద ఫోకస్ పెట్టాడని అజయ్ చెప్పడం విశేషం. ఇదే విషయాన్ని అవినాష్ నిన్నటి ఎపిసోడ్‌లో అరియానాతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే నన్ను వదిలేసి పోయింది. అప్పుడే తట్టుకొని నిలబడ్డాను. దానిని భరించాను. దాని ముందు ఏదైనా తట్టుకోగలను అని అన్నాడు.

Bigg Boss 4 Telugu Avinash Breakup Story With Ariyana
Bigg Boss 4 Telugu Avinash Breakup Story with Ariyana

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News