బిగ్‌బాస్ షోలో మోనాల్ మనస్తత్వం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆమెకు టైంపాస్ కావడానికి ఎవరినోకరిని వాడుకుంటోందా? అన్న అనుమానం కలుగుతోంది. మొన్నటి వరకు అభిజిత్ మాట్లాడే వాడు కాబట్టి.. అర్దరాత్రి దాటాక కూడా ముచ్చట్లు పెడుతూ ఉండేది. పగలంతా అఖిల్‌తో గడుపుతుంది. అఖిల్‌కు రాత్రి తొందరపగా పడుకునే అలవాటు ఉండటంతో.. రాత్రి పూట అభిజిత్‌తో కాలం గడిపేది.
ఇలా వ్యవహారం కొన్ని రోజుల వరకు బాగానే సాగింది. ట్రయాంగిల్ కథల అందరూ అనుకున్నారు. కానీ ఆ ఇద్దరినీ మోనాల్ ఆడిస్తోందని బయటకు వచ్చిన కంటెస్టెంట్లు చెబుతున్నారు. ఆయన లేకపోతే ఈయన, ఈయన లేకపోతే ఆయన అంటూ ఆమె రెండు పడవల మీద నడుస్తోందని సుజాత కూడా కామెంట్లు చేసింది. మొన్నటి వీకెండ్‌తో జరిగిన గొడవతో అభిజిత్ మోనాల్ మధ్య దూరం పెరిగింది. ఇక ఎప్పుడూ నీతో మాట్లాడను అంటూ మోనాల్‌కు అభిజిత్ దూరంగా ఉండిపోయాడు.
ఇలా అభిజిత్ దూరంగా ఉండిపోవడంతో రాత్రి వేళ బోర్ కొడుతున్నట్టుంది. అందుకు తనకు ఎప్పటి నుంచో లైన్ వేస్తోన్న అవినాష్‌ను ట్రాకులోకి ఎక్కించుకున్నట్టుంది. అభి దూరంగా ఉంటున్నప్పటి నుంచి మోనాల్ అవినాష్‌ను దగ్గర చేసుకుంటోంది. ఇద్దరూ గోరు ముద్దలు తినిపించుకోవడం జరిగింది. ఇక నిన్న అర్దరాత్రి ఒంటి గంటలకు సల్సా డ్యాన్సులు వేశారు. యూ ఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ పాటలు పాడతూ అరుస్తూ నానా రచ్చ చేశారు.