Bigg Boss 4 Telugu : మల్లెమాలది ఎంతటి దారుణం.. అవినాష్‌కు మళ్లీ జబర్దస్త్‌లోకి నో ఎంట్రీ!!

Bigg Boss 4 Telugu Avinash About Jabardasth And Mallemala

జబర్దస్త్, మల్లెమాల వారి అగ్రిమెంట్ల గురించి ఆ మధ్య మీడియాలో, సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వస్తూ అందులోని లోపాలు, అందులో జరిగే అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా బట్టబయలు చేశారు. అగ్రిమెంట్ల పేరుతో ఎలా బంధిస్తారు.. ఎలా కట్టడి చేస్తారో కూడా చెప్పాడు. అందులో భాగంగానే నాగబాబుతో బయటకు వస్తుంటే.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శీను వంటి వారిని అగ్రిమెంట్ల పేరుతో బంధించేశారు.

Bigg Boss 4 Telugu Avinash About Jabardasth And Mallemala
Bigg Boss 4 Telugu Avinash About Jabardasth And Mallemala

మల్లెమాల వారు ఆర్టిస్ట్‌లను అగ్రిమెంట్ల పేరుతో జైల్లో బంధించినట్టు కట్టడి చేస్తుంటారు. జబర్దస్త్ షోలో చేసే వారు మిగతా షోల్లో, మిగతా చానెళ్లలో పని చేయకూడదని నిబంధనలు పెడుతుంటారు. అలా ఎన్నో రకాలు మెల్లమాల జబర్దస్త్ ఆర్టిస్ట్‌లకు బంధనాలు వేస్తుంటాయి. అందులో భాగంగానే అవినాష్‌కు బిగ్ బాస్ షోలో వెళ్లేందుకు నానా రకాలు ఇబ్బందులకు గురి చేశారు. చివరకు అగ్రిమెంట్ ప్రకారం పది లక్షలు చెల్లించాలని పట్టుబట్టారట. పది లక్షలు కట్టి అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.

అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అవినాష్ పరిస్థితి అయోమయంగా మారేట్టు కనిపిస్తోంది. మళ్లీ జబర్దస్త్ షోలోకి తీసుకోమని ముందే చెప్పారట. అక్కడి అందరితో గొడవ పెట్టుకుని వచ్చాను.. అవమాన పడి వచ్చాను.. పరిస్థితి ఏంటో అని అవినాష్ ఆందోళన చెందాడు. నిన్నటి టాస్క్‌లో అవినాష్‌ నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు శాయశక్తులా టాస్క్ ఆడాడు. కానీ ఫలితం రాలేదు. అలా నిరాసక్తితో ఉన్న అవినాష్ మల్లెమాల, జబర్దస్త్ షో గురించి పరోక్షంగా కామెంట్ చేశాడు. ఇక్కడ నేను గెలవాల్సిందే.. ఎన్నింటినో కాదనుకుని వచ్చాను అంటూ అవినాష్ బాధపడ్డాడు. ఏది ఏమైనా మల్లెమాల వ్యవహారం మాత్రం నిర్దయగా కనిపిస్తోంది.