బిగ్ బాస్4: అరియానా దోస్త్ అభిజిత్ ఫ్యాన్.. మొహం మాడిపోయినట్టుంది

Bigg Boss 4 Telugu Ariyana Friend Vineeth ABout Abhijeet

బిగ్ బాస్ షోలో ఈ వారం మొత్తం ఇక ఫ్యామిలీ టచ్ ఇవ్వడమే సరిపోయింది. కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా నియమాలు పాటిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎదురుచూడసాగారు. మొన్నటి రోజు తల్లి ప్రేమను చూపించిన బిగ్ బాస్.. నిన్నటి ఎపిసోడ్‌లో తండ్రి, దోస్త్, సోదరి ప్రేమను చూపించాడు. నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్ సిస్టర్ హెమాలి, సోహెల్ తండ్రి సలీం, అరియానా స్నేహితుడు వినీత్ వచ్చారు. ఈ ముగ్గురితోనే నిన్న షో అంతా నడిచింది. అందులో చాలానే హైలెట్ మూమెంట్స్ ఉన్నాయి.

Bigg Boss 4 Telugu Ariyana Friend Vineeth ABout Abhijeet
Bigg Boss 4 Telugu Ariyana Friend Vineeth ABout Abhijeet

అరియానా ఫ్రెండ్ వినీత్ రావడంతో ఆమెలో ఉన్న అతి నిద్రలేచినట్టుంది. అతియానా ఏడుపులు ఓవర్ యాక్షన్ నిన్నటి ఎపిసోడ్‌లో శ్రుతి మించాయి. వినీత్‌ను చూడటంతో ఏడుస్తూనే ఉంది. నాతోనే మాట్లాడు నన్నే చూడంటే తెగ వాగేసింది. ఇంటి సభ్యుల యోగక్షేమాలను అడిగింది. మామూలుగా అయితే అరియానా చెల్లి రావాల్సిందట కానీ తానే కొట్లాడి మరీ వచ్చానంటూ వినీత్ చెప్పుకొచ్చాడు. అరియానా ఆట ఎలా ఆడుతుందన్న విషయాన్ని మాత్రం అంత స్పష్టంగా తనకు చెప్పలేకపోయాడు.

ఎలా ఆడుతున్నాను అని పలుమార్లు అడిగినా కూడా.. బాగానే ఆడుతున్నావ్ అంటూ అరియానాకు వినీత్ సమాధానం ఇస్తూ వచ్చాడు. అయితే వినీత్ మాత్రం అందరితో అంత సన్నిహితంగా కలుపుగోలుదనంగా మాట్లాడలేదు. అరియానా అవినాష్ ఇలా కొంతమందితోనే మాట్లాడాడు. అందులో అభిజిత్‌కు హాయ్ చెప్పి బిగ్ ఫ్యాన్ అని వినీత్ అనడంతో కొందరి మొహాలు మాడిపోయాయి. ఇంట్లో అందరూ కలిసిపోయారు అని అనుకుంటుంటే మళీ నిన్నటి ఎపిసోడ్‌తో అది తప్పని తెలిసిపోయింది.