Home Entertainment Bigg boss 4 Telugu: అందరికి అందరూ ఉన్నారు.. ఒంటరినైపోయానని బాధపడుతోన్న మోనాల్ కామెంట్స్

Bigg boss 4 Telugu: అందరికి అందరూ ఉన్నారు.. ఒంటరినైపోయానని బాధపడుతోన్న మోనాల్ కామెంట్స్

బిగ్ బాస్ షోలో అఖిల్ మోనాల్ ట్రాక్ కాస్త డిఫరెంట్. మొదటి నుంచి చాలా ధృడంగానే ఉంది. అయితే ఆ బంధానికి ఈ మధ్యే బీటలువారుతున్నాయి. గతవారంలో అది ప్రారంభమైంది. ఈ వారంలో అది నామినేషన్ వరకు వెళ్లింది. ఇక మున్ముందు ఎంత వరకు వెళ్తుందో చూడాలి. అది ఇది శాశ్వతమైన దూరంలా అనిపించడం లేదు. నామినేట్ చేసిన మోనాల్‌కు మళ్లీ బాసటగా నిలిచాడు. టాస్క్‌లో సాయం చేశాడు. అయితే అభిజిత్ నామినేట్ చేసినప్పుడు అంతగా బాధపడని మోనాల్.. అఖిల్ కూడా చేయడంతో కుంగిపోయింది. తన బాధనంతా కన్నీరు రూపంలో బయటకు రానిచ్చింది.

Bigg Boss 4 Telugu Amma Rajasekhar Consoles Monal
Bigg boss 4 Telugu Amma Rajasekhar Consoles Monal

నామినేట్ చేసే సమయంలో అఖిల్ చెప్పిన కారణాలు సరైనవి కాదని, అసలు కారణం తనకు తెలుసునని మోనాల్ ఏడ్చేసింది. అయినా అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కారని ఇంకా ఎక్కువ ఆశిస్తారని. అది లేదు కదా. అందుకే నామినేట్ చేశాడన్నట్టుగా అఖిల్ గురించి అమ్మ రాజశేఖర్ వద్ద వాపోయింది. మనుషులను జడ్జ్ చేయడంలో నేను ఎప్పుడూ తప్పు నిర్ణయాలే తీసుకుంటాను.. నాకు మనుషుల్ని జడ్జ్ చేయడం రాదని చెబుతూ మోనాల్ కన్నీరు మున్నీరైంది. ఇక ఇంట్లో తాను ఇప్పుడు ఒంటరినయ్యాననే ఫీలింగ్ వస్తోందని అమ్మ రాజశేఖర్‌తో చెప్పుకొచ్చింది.

అవినాష్, అరియానా, మీరు ఓ గ్రూప్ అని అమ్మ రాజశేఖర్‌తో చెప్పుకొచ్చింది. లాస్య, హారిక, అభిజిత్ ఓ గ్రూపు అందులో అఖిల్ కూడా చేరాడని అంది. ఇంకా అఖిల్‌కు సోహెల్, మెహబూబ్‌తో ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇక ఎటొచ్చి నేను ఒంటరినైపోయాను అంటూ కన్నీరు పెట్టేసుకుంది. అలా బాధపడుతున్న మోనాల్‌కు అమ్మ రాజశేఖర్ భరోసా ఇచ్చాడు. ఇప్పటి నుంచి నీకు తోడుగా ఉంటాను.. నువ్ ఉండే వరకు నేను కూడా ఉంటాను అంటూ మాటిచ్చాడు. కానీ ఈ వారం ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారో చూడాలి. నామినేషన్స్‌లో ఈ ఇద్దరూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News