బిగ్ బాస్ షోలో పదో వారం అఖిల్ సీక్రెట్ రూంలోకి వెళ్లాడు. అది కూడా కంటెస్టెంట్లందరి చేత ఓ పెద్ద డ్రామా ఆడించాడు. మీ ప్రయాణానికి ఎవరైతే అడ్డుగా ఉంటారని భావిస్తారో.. ఎవరు స్ట్రాంగ్ అని భావిస్తున్నారో ఏకాభిప్రాయంతో చెప్పండని బిగ్ బాస్ తెలిపాడు. ఇక అందరూ కలిసి సుధీర్ఘచర్చల తరువాత అఖిల్ పేరును చెప్పారు. దీంతో అఖిల్‌ను గేట్ బయటకు పంపించేశాడు. అయితే ఇంటి సభ్యులు అఖిల్ ఎలిమినేట్ అవుతారని భావించాడు కానీ సీక్రెట్ రూంలోకి వెళ్లిపోయాడు.
సీక్రెట్ రూం నుంచి అందర్నీ గమినించాడు. ముఖ్యంగా అఖిల్ మోనాల్ విషయంలో అసలు సంగతులు తెలుసుకుంటున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి తన పేరును తెరపైకి తీసుకొచ్చింది మోనాలే. చివరకు వెళ్లిపోతుంటే బిక్కుబిక్కుమని ఏడిచింది మోనాలే. పేరు ఎందుకు చెప్పాలి.. ఎందుకు ఏడ్వడం అన్నది మోనాల్‌కే తెలియాలి. అఖిల్ వెళ్లాక చాలా సేపు ఏడుస్తూనే ఉంది. ఇక బెడ్రూంలో పడుకుని ఏడుస్తూ ఓ దిండుతో మాట్లాడుకుంది.
అఖిలే నెంబర్ వన్ అంటూ.. నువ్ స్ట్రాంగ్ కదా.. నేను చేసింది కరెక్టే కదా.. అంటూ అఖిల్‌ను తలుచుకుంది. ఇదంతా సీక్రెట్ రూం నుంచి అఖిల్ గమినించసాగాడు. మళ్లీ అభిజిత్‌తో కూర్చుని ముచ్చట్లుపెట్టింది మోనాల్. అయితే మోనాల్ అక్కడ అఖిల్ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ అఖిల్ మాత్రం మోనాల్ ఏం చెబుతుందా అని ఎదురుచూసినట్టు కనిపించింది. ఈమె ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదంటూ మోనాల్‌పై అఖిల్ సెటైర్ వేశాడు.