Bigg Boss 4 Telugu.. ఎందుకంత నోటి దూల.. అఖిల్‌పై నెటిజన్స్ ఫైర్

బిగ్‌బాస్ ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియనే జనాలు ఓర్చుకోవడం లేదు. బిగ్ బాస్‌ను ఏకిపారేస్తున్నారు. మోనాల్‌కు తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఆమెను సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేసేశాడని బిగ్ బాస్ షో నిర్వాహకులను బండ బూతులు తిడుతున్నారు. టీఆర్పీల కోసమే ఇదంతా చేశావా? అని ఇష్టమొచ్చినట్టు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా ఓ సైడ్ అనుకుంటే.. మరో సైడ్‌ అఖిల్‌ను ఆడుకుంటున్నారు.

Bigg Boss 4 Telugu Akhil Ir Trolled For Commenting Kumar Sai
Bigg Boss 4 Telugu Akhil Ir Trolled For Commenting Kumar Sai

ఎలిమినేట్ అయి ఓ కంటెస్టెంట్ వెళ్లిపోతుంటే.. అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే.. చెప్పేది వినాలి. రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు. అందులో మంచి ఉంటే తీసుకోవాలి.. లేదా వదిలేయాలి. అతను చెప్పింది కరెక్టా? కాదా? అని జనాలు చూసుకుంటారు. అంతేగానీ నేను సేవ్ అయిపోయాను.. నువ్ ఎలిమినేట్ అయిపోయావ్ అని బలుపు, పొగరు ఉండ కూడదు. కానీ అఖిల్‌కు మాత్రం కనీసం ఇంగితజ్ఞానం కూడా లేదు.

Bigg Boss 4 Telugu Akhil Ir Trolled For Commenting Kumar Sai
Bigg Boss 4 Telugu Akhil Ir Trolled For Commenting Kumar Sai

కూరగాయాలతో ఇంటి సభ్యులను పోల్చమని నాగార్జున కుమార్ సాయికి టాస్క్ ఇచ్చాడు. అందులో కరివేపాకు అఖిల్‌తో పోల్చాడు. కష్టపడుతున్నావ్ గానీ ఇంకా బాగా ఆడాలి అంటూ ఇలా ఏదో ఓ సూచన ఇచ్చాడు కుమార్ సాయి. అది వినకుండా.. నువ్ బాగా ఆడి కూడా ఎలిమినేట్ అయ్యావ్ కదా అని ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడేశాడు. ‌కు ఉన్న ఈ బలుపుపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.