బిగ్ బాస్ షోలో మొదటి రెండు వారాలు ప్రేమదేశం కథను చూపించారు. వినీత్ టబు అబ్బాస్‌లా అభిజిత్ మోనాల్ అఖిల్ కథ నడిచింది. మొదట్లో అఖిల్ అభి ఇద్దరూ క్లోజ్‌గా ఉన్నారు. బాగా మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి మోనాల్ గురించి చర్చించుకున్నారు. ఓరేయ్ రా అని పిలవడంలో తేడాలు రావడంతో ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఆ దూరం కాస్త మోనాల్ వల్ల అగాథంగా మారింది. మోనాల్ వల్లే వీరిద్దరూ ఇంత దూరమయ్యారనేది కనిపిస్తూనే ఉంది.
పగలంతా అఖిల్‌తో ముచ్చట్లు పెడుతుంది. రాత్రి అఖిల్ తొందరగా పడుకుంటాడట. అఖిల్ పడుకున్నాక మోనాల్ అభిజిత్‌తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం బాగానే నడిచింది. నువ్ అంటే ఇష్టం అని అభితో మోనాల్ చెప్పడం, ఆ మాట అటూ ఇటూ తిరిగి పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది. నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ అఖిల్ మాట్లాడుకోవడం మధ్యలో మోనాల్ టాపిక్ రావడంతో మరింత భగ్గుమంది.
అలా అక్కడ జరిగిన గొడవ, మోనాల్ రెండు నాల్కల ధోరణిని తెలుసుకున్న అభిజిత్ దూరంగా ఉండిపోయాడు. దాదాపు రెండు వారాలకు పైగానే మాట్లాడకుండా దూరంగా ఉన్నాడు. ఈ వారం నామినేషన్‌లో మోనాల్‌ను అభిజిత్ నామినేట్ చేయడంతో మళ్లీ టాపిక్ వచ్చింది. అభిజిత్‌తో ఉన్న గొడవలను క్లియర్ చేసుకోవాలని మోనాల్ ప్రయత్నించింది. నిన్నటి ఎపిసోడ్‌లో ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. జర్నీ వీడియో చూపించడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. అందులో ఈ ముగ్గురి ట్రాకును చూసి ఎంతో సంబరపడ్డారు. ఇలా మొత్తానికి ఈ ముగ్గురు మళ్లీ కలిసిపోయారు. ఇక రాను రాను ఎలా ఉంటుందో చూడాలి.