బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అభిజిత్ అఖిల్ కాంబో అంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. అరేయ్, ఒరేయ్, రా రా అంటూ మొదలైన వివాదం.. మోనాల్ వల్ల తారాస్థాయికి చేరుకుంది. పగలంతా అఖిల్‌తో గడిపే మోనాల్.. రాత్రి పూట అభిజిత్‌తో ముచ్చట్లు పెడుతుంది. ఇలా ఈ ఇద్దరితో వ్యవహారం నడిపేది. ఒకరిని నొప్పించుకుండా ఇద్దరితో ఒకే సారి ప్రయాణం చేయడంతో ఆ ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి.
ఒకరంటే ఒకరు పడనంతగా తయారైంది. చివరకు నామినేషన్‌లలో కూడా ఆమె పేరును తీసుకొచ్చి కొట్టుకునేంత వరకు వెళ్లింది. మొదట్లో మంచి మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరూ కాలక్రమేణ శత్రువుల్లా మారాడు. కానీ అభిజిత్ మాత్రం ఏనాడూ కూడా అఖిల్‌ను టార్గెట్ చేసినట్టు కనిపించలేదు. ఇంకా అభిజిత్ గురించి అఖిల్ మాట్లాడుతుంటాడు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ మీ జర్నరీలో విలన్ ఎవరంటే అభిజిత్ సింపుల్‌గా తేల్చిపడేశాడు.
అభిజిత్ తన జర్నీలో విలన్‌గా అమ్మరాజశేఖర్ పేరు చెప్పాడు. మామూలుగా అయితే అందరూ అఖిల్ పేరు చెబుతారని ఊహిస్తారు. కానీ అభి అలా చేయలేదు. కానీ అఖిల్ మాత్రం అభిజిత్ విలన్ అని తెలిపాడు. అయితే ఇప్పుడు మాత్రం విలన్ కాదు.. గతంలో అని చిన్న కార్లిటీ ఇచ్చాడు అఖిల్. తనకు మాత్రం ఎప్పుడూ కూడా అఖిల్ విలన్ అని అనిపించలేదని అభిజిత్ అన్నాడు. ఆ ఇద్దరి మధ్య ఉన్న తేడా అదే. అందుకే అభిజిత్ మంచి మనసుతో, చిరునవ్వుతో పలకరిస్తూ, తప్పు చేస్తే క్షమాపణలు చెబుతూ ముందుకు దూసుకుపోతున్నాడు.