బిగ్ బాస్ 4.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించే చర్చ. నిక్కచ్చిగా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుంది. కరోనా సమయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. బిగ్ బాస్ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఈ సీజన్ కూడా సక్సెస్ అయినట్టే.
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. ఓవైపు నామినేషన్ల ఫైర్.. ఇంట్లో ఈ వారం ఎవరు వెళ్లిపోతారా అని.. ఎవరు ఈ వారం కెప్టెన్ అవుతారని.. ఇలా రకరకాల పరిస్థితుల మధ్య బిగ్ బాస్ హౌస్ ఉంది. అందులోనూ బిగ్ బాస్ సగం ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇంకో కొన్ని రోజుల్లో సెమీ ఫైనల్స్ కూడా వచ్చేస్తాయి. షో ఇంకా రంజుగా ఉంటుంది అప్పుడు.
చాలామంది బిగ్ బాస్ షోను ఎందుకు చూస్తారో తెలుసా? ఆ ఇంటి కోసం. అవును.. బిగ్ బాస్ హౌస్ ఎంత బాగుంటుంది. ఆ ఇల్లును చూడటం కోసమే కొందరు ఆ షోను చూస్తారు. బిగ్ బాస్ హౌస్ అనేది సెట్. ఈ సీజన్ అయిపోగానే.. దాన్ని కూల్చేస్తారు. వచ్చే సంవత్సరం మరో సెట్ వేస్తారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా సెట్స్ వేస్తుంటారు.
ఈసారి వేసిన సెట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. బిగ్ బాస్ సెట్ ను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. రెండో సీజన్ నుంచి అక్కడే వేస్తున్నారు సెట్. ఒక్క మొదటి సీజన్ కు మాత్రం సెట్ ను ముంబైకి సమీపంలోని లోనవాలాలో వేశారు.
అయితే.. బిగ్ బాస్ సెట్ ను బయటి నుంచి ఎప్పుడూ చూసి ఉండరు కదా. హౌస్ ను లోపల నుంచి చూడటం తప్పితే.. బయట నుంచి చూసే చాన్స్ దొరకలేదు కదా. అందుకే మీకోసం.. బిగ్ బాస్ హౌస్ ఏరియల్ వ్యూ వీడియోను తీసుకొచ్చాం.
ఆ సెట్ ను ఎక్కడ వేశారో చూస్తే మీ మతి పోతుంది. బిగ్ బాస్ హౌస్ సెట్ పక్కనే.. నాగార్జున హోస్ట్ చేసే వీకెండ్ షోలకు సంబంధించిన సెట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియోను చూసేయండి మరి..