బిగ్ బాస్ షో సీజన్ 4 ఎండింగ్ దశకు వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ లో ఎక్కువమంది కంటెస్టెంట్లను అనారోగ్య సమస్యలు వెంటాడిన విషయం తెలిసిందే. గంగవ్వ, నోయల్, అమ్మ రాజశేఖర్, అభిజిత్ ఇలా కంటెస్టెంట్లందరూ బిగ్ ఇంట్లో ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అమ్మ రాజశేఖర్ తన సమస్యలను బయటకు చెప్పలేదు. అభిజీత్ కూడా తన సమస్యలను బయటకు చెప్పలేదు కానీ.. ఫిజికల్ టాస్కుల్లో అంతగా ప్రదర్శన చేసేవాడు కాదు. ఇక నోయల్, గంగవ్వలు అనారోగ్యం సమస్యల వలనే బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు.
అయితే అభిజీత్ ఫిజికల్ టాస్కుల్లో అంతగా ప్రదర్శన కనపరచకపోవడానికి గల కారణాలను బయట ఇంటర్వ్యూలో అతని సన్నిహితులు, ఫ్రెండ్స్ వివరించేవారు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు అదే విషయాన్ని చెప్పుకొచ్చేవారు. అభిజీత్ భుజానికి తీవ్రమైన గాయముందని, కాలికి కూడా గాయమైందని పలువురు తెలియజేశారు. అభిజీత్ భుజానికి గాయమైనప్పటి ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అయ్యాయి. అందుకే అతడు ఫిజికల్ టాస్కులు ఇచ్చినప్పుడు అంత యాక్టీవ్ గా కనిపించడు. అతడి ఈ విషయం కొంచెం నెగటివ్ గా కూడా మారింది. పలువురు విమర్శించడానికి ఒక ఆయుధం అయ్యింది.
అయితే కమాండో ఇన్‌స్టిట్యూట్ టాస్క్‌లో అభిజీత్ కాస్త ఒళ్ల వంచినట్టు కనిపించాడు. అక్కడ మాత్రం ఫిజికల్ టాస్కుల్లో ప్రదర్శన చేశాడు. రన్నింగ్ చేయడం, వేలాడడం వంటి స్టంట్లు వేశాడు. కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించాడు…కానీ ముందుకు వెళ్లలేకపోయాడు. అయితే తాజగా మరో ఫిజికల్ టాస్క్‌లో అభిజిత్ పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టాస్కులో అభిజీత్‌కు సంబంధించిన లీకులు బయటకు వచ్చాయి.
ఇవాళ ఎపిసోడ్‌లో అభిజిత్‌కు గాయాలు అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద అభిజీత్ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలాయట. ఫైనల్ కు చేరువైన నేపథ్యంలో ఈ వార్తలు అతడి అభిమానులను కలవరపెడుతున్నాయి. అయితే అవి చిన్న, చిన్న గాయాలే అని లీకువీరులు చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.