Home News బిగ్ బాస్ 4: సండే స‌ర్‌ప్రైజ్‌‌.. బిగ్ బాస్ స్టేజ్‌పై నాగ్‌తో పాటు మ‌రో హీరో

బిగ్ బాస్ 4: సండే స‌ర్‌ప్రైజ్‌‌.. బిగ్ బాస్ స్టేజ్‌పై నాగ్‌తో పాటు మ‌రో హీరో

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ . తెలుగులో సీజన్ 4 జ‌రుపుకుంటున్న ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. ద‌స‌రాకు మాత్రం ఆయ‌న వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మ‌నాలీ వెళ్ల‌డంతో త‌న మామ బాధ్య‌త‌ల‌ను స‌మంత తీసుకొని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించింది. ఆ ఎపిసోడ్‌కు భారీ రేటింగ్ రావ‌డంతో నిర్వాహ‌కుల‌తో పాటు సామ్ కూడా సంతోషం వ్య‌క్తం చేసింది. సీజ‌న్ 4లో మ‌రో మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉన్న నేప‌థ్యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఈ కార్య‌క్రమానికి మ‌రో స్టార్ హీరోని తీసుకొస్తున్నారు. అది హోస్ట్‌గా కాదు, కేవ‌లం గెస్ట్‌గానే.

Nagg | Telugu Rajyam

క‌న్న‌డ నాట స్టార్ హీరోగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈగ సినిమాతో ఆయ‌న టాలీవుడ్‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాలు చేశాడు. ఇప్పుడు ఫాంథ‌మ్ అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాని ప్ర‌మోట్ చేసుకునే పనిలో భాగంగా సుదీప్ ..బిగ్ బాస్ తెలుగు షోకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ షోలో నాగార్జున‌తో క‌లిసి దిగిన ఫొటోని సుదీప్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. బిగ్ బాస్ తెలుగు షోకు హోస్ట్‌గా వెళ్ల‌డం ఆనందాన్ని క‌లిగిస్తుంది. నాగార్జున గారితో పాటు హౌజ్‌మేట్స్‌తో మాట్లాడ‌డం స‌ర‌దాగా అనిపించింద‌ని సుదీప్ పేర్కొన్నారు.

Nag Sudeep | Telugu Rajyam

గ‌తంలో చాలా స్టార్స్ కూడా త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం బిగ్ బాస్ షోకు హాజ‌ర‌య్యేవారు. ఇప్పుడు క‌రోనా వ‌ల‌న సినిమా షూటింగ్స్ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో తార‌ల సంద‌డి పెద్ద‌గా లేదు. ఆ మ‌ధ్య అఖిల్ త‌న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం బిగ్ బాస్ షోకు హాజ‌రై కాసేపు సంద‌డి చేశాడు. ఇదిలా ఉంటే సీజ‌న్ 4 చివ‌రి ద‌శ‌కు చేరుకోగా, మ‌రో మూడు వారాల‌లో ముగింపు కార్డ్ వేయ‌నున్నారు. ఇందులో విజేత‌గా ఎవ‌రు నిలుస్తారు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

 

- Advertisement -

Related Posts

అసలు పేరు అదే.. గుట్టు విప్పిన అషూ రెడ్డి

బిగ్ బాస్ షో ద్వారా అషూ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు డబ్ స్మాష్ అనే యాప్ ద్వారా వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అలా...

నరాలు తెగే ఉత్కంఠ: నిమ్మగడ్డ, వైఎస్ జగన్.. గెలిచేదెవరు.?

గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

Latest News