బిగ్ అప్డేట్ : “టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్ కి తేదీ ఖరారు..!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో అయితే తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి. మరి స్టూవర్టుపురం పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా కాస్త కల్పితాన్ని కూడా జోడించి తెలుగు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కోసం కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఇది.

మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. కాగా రీసెంట్ గా వచ్చిన టీజర్ కి కూడా క్రేజీ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం ట్రైలర్ కోసం అంతా ఎదురు చూసారు. ఇదేదో రవితేజ వెర్షన్ కేజీఎఫ్ లా ఉందని ఆల్రెడీ అర్ధం అయ్యిపోయింది.

ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. దీనితో ఈ భారీ సినిమా ట్రైలర్ రిలీజ్ ని ఈ అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఫిక్స్ చేశారు. మరి ఈ బిగ్ అప్డేట్ పై వదిలిన పోస్టర్ కూడా కేజ్రీగా ఉండగా మొత్తానికి అయితే ఎక్కడికక్కడ హైప్ ని మేకర్స్ అలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయితే అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ భారీ సినిమాని పాన్ ఇండియా నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 20న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 
https://x.com/AAArtsOfficial/status/1706677709596987429?s=20