పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా పలు సెన్సేషనల్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మాసివ్ ఏక్షన్ డ్రామా “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. మరి దీనిపై అంచనాలు ఇప్పుడు తారా స్థాయిలో ఉండగా ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు.
కాగా ఈ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన మొట్ట మొదటి సెన్సేషనల్ చిత్రం ఇది కాగా ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది చాలా ఆసక్తిగా ఉండగా ఈ చిత్రం నిజానికి నిన్న సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సింది. కానీ ఈ చిత్రం వాయిదా పడింది. మరి కొత్త డేట్ ఎప్పుడు అసలు ఈ ఏడాదిలో ఉంటుందా లేదా అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా మారింది.
దీనితో మేకర్స్ అయితే ఓ క్లారిటీ ఇచ్చేస్తారని నిన్ననే ఓ సెన్సేషనల్ క్లారిటీ రాగా ఇవాళ ఫైనల్ గా ఈ సరికొత్త బగ్ అప్డేట్ ని అందించేసారు. దీనితో సలార్ సినిమా ఈ ఏడాదిలోనే డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రభాస్ పై ఒక క్రేజీ అండ్ మాస్ పోస్టర్ రిలీజ్ చేసి తెలిపారు.
మరి ఇందులో ప్రభాస్ అయితే ఓ ఫుల్ ఏక్షన్ సీక్వెన్స్ అనంతరం గట్టిగా బ్లడ్ లో కనిపిస్తున్నాడు. అలాగే కట్ బనియన్ తో తన సాలిడ్ బాడీ చూపిస్తూ రెబల్ రోజులు అయితే తాను గుర్తు చేసాడు. దీనితో ఒక్కసారిగా సలార్ ఈ మాసివ్ అనౌన్సమెంట్ వైరల్ అవుతుంది. మొత్తానికి సలార్ మాస్ ఆగమనం డిసెంబర్ కి లాక్ అయ్యింది అని చెప్పాలి.
https://x.com/SalaarTheSaga/status/1707621425329455184?s=20