బిగ్ అప్డేట్ : పవన్ – సాయి తేజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.!

ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న వెరీ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్ అయితే హైదరాబాద్ లో శరవేగంగా కంప్లీట్ అవుతుండగా సముద్రఖని ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే బహుశా నెల రోజులు కితం అలా షూటింగ్ స్టార్ట్ అయ్యిన ఈ సినిమా నుంచి ఇంకా టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని రిలీజ్ కాలేదు కానీ అప్పుడే మేకర్స్ రిలీజ్ డేట్ తో షాకిచ్చారు. అసలు ఈరోజు ఎలాంటి చిన్న హింట్ కూడా లేకుండా సైలెంట్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేయడం విశేషం.

కాగా ఈ సినిమా అయితే ఈ జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంటే ఇక దీనికి ఎన్నో నెలలు కూడా లేదని చెప్పాలి. దీనితో ఈ అప్డేట్ తో మాత్రం పవన్ ఫ్యాన్స్ ఒకింత షాక్ అవుతున్నారు కానీ పర్వాలేదు హ్యాపీ గానే ఉన్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ దేవుని పాత్ర చేస్తుండగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఐతే ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.