అఫీషియల్ : “NTR30” లో బాలీవుడ్ బిగ్ స్టార్ ఫిక్స్.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హైప్ ఉన్నటువంటి లేటెస్ట్ భారీ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ సినిమా ఎన్టీఆర్ 30 కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలు కాగా ఈరోజు నుంచి సినిమా రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది.

కాగా ఈ భారీ సినిమాపై ఐతే గత కొన్ని రోజుల నుంచి విలన్ పై పలు రూమర్స్ వైరల్ గా మారాయి. అయితే అవి అంత అబద్దం అని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు దీనిపై అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తునట్టుగా మేకర్స్ బిగ్ అప్డేట్ ని అయితే అందించారు.

మరి ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి సెట్స్ నుంచి క్యాజువల్ గానే ఈ బిగ్ అనౌన్సమెంట్ ని అందించేసారు. అయితే ఈ అప్డేట్ లో ఇంట్రెస్టింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది ఎన్టీఆర్ కొరటాలతో చాలా ఎనర్జిటిక్ గా సెట్స్ లో కనిపిస్తున్నాడు.

మరి తమ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఈరోజే జాయిన్ అయ్యినట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే పాన్ ఇండియా లెవెల్లో బాగానే సినిమాకి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ అవైటెడ్ సినిమాలో మరింత మంది బిగ్ స్టార్స్ కనిపించనుండగా హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండగా అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.