బిగ్ క్లారిటీ : “వార్ 2″లో ఎన్టీఆర్..కన్ఫర్మ్ చేసిన హృతిక్.!

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఒక్క పాన్ ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా ఓ రేంజ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇపుడు ఎన్టీఆర్ పలు మాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలు తో పాటుగా ఎన్టీఆర్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ కి కూడా రంగం సిద్ధం అయ్యినట్టుగా ఇది వరకే టాక్ ఉంది.

అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు కానీ ఇపుడు ఏకంగా హీరో హృతిక్ రోషన్ నుంచే అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ హృతిక్ లు కలిసి “వార్ 2” చేయనున్నారన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఊహించని విధంగా తారక్ కి హృతిక్ రోషన్ విషెష్ చెప్పడం క్రేజీ థింగ్ గా మారింది.

మరి తాను ఏమని చెప్పాడంటే. “హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ నీకు ఈ ఏడాది యాక్షన్ ప్యాకెడ్ తో కూడిన సంవత్సరంలా ఉండాలి. యుద్ధభూమి లో నిన్ను కలిసేందుకు ఎదురు చూస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా” అంటూ తెలుగు లో కూడా హృతిక్ పోస్ట్ చేసాడు.

అయితే ఇక్కడ యుద్ధ భూమి అనే మాట తో అయితే “వార్ 2” లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడని అయితే సెన్సేషనల్ క్లారిటీ ని తాను ఇచ్చేసాడని చెప్పాలి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.