టాలీవుడ్ ప్రముఖ సినీ ఫ్యామిలీస్ లో అక్కినేని వారి పరిస్థితి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర భారీగా పడిపోయింది. నాగ్ నుంచి మొన్న చైతు వరకు కూడా ఘోస్ట్, ఏజెంట్, అలాగే “కస్టడీ” చిత్రాలు అయితే వరుస డిజాస్టర్స్ అయ్యాయి. నాగ్ అఖిల్ పరిస్థితి ఏమో కానీ చైతు అయితే మరీ దారుణం అని చెప్పాలి.
కస్టడీ కి ముందు చైతు ఉన్న థాంక్ యూ నే భారీ డిజాస్టర్ అనుకుంటే దీని తర్వాత ఈ సినిమా మరో డిజాస్టర్ గా మారింది. అయితే అఖిల్ ఏజెంట్ కస్టడీ తప్పకుండ రాణిస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ లాస్ట్ కి ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
ఇక ఈ టాక్ తో ఈ సినిమా చూద్దాం అనుకున్నవారు కూడా ఇక లాస్ట్ మినిట్ లో ఓటిటి రిలీజ్ కోసం అయితే వెయిట్ చేసారు. ఇక దీనిపై అయితే బిగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఈ సినిమా అయితే ఇపుడు ఇందులో తెలుగు మరియు తమిళ్ సహా కన్నడ మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.
కాగా ఈ సినిమా ఈ జూన్9 నుంచి అయితే ఓటిటి లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో కస్టడీ ఓటిటి డేట్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా తాను రెండు భాషల్లో ఒకేసారి తీశారు. అలాగే కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
embark on a heart-pounding journey with constable Siva as he works his way through a web of corruption, betrayal, and lies! 👮♂#CustodyOnPrime, June 9 pic.twitter.com/oosDXGXjE8
— prime video IN (@PrimeVideoIN) June 7, 2023