అఫీషియల్ : “బిగ్ బాస్ 7” లాంచ్ డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేసాయ్.. 

వరల్డ్ వైడ్ గా కూడా మంచు పాపులార్టీ అందుకున్న పలు సెన్సేషనల్ రియాలిటీ షోస్ లో అయితే ఈ రియాలిటీ షోస్ లో ఓ ట్రెండ్ ని సెట్ చేసిన గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్” కూడా ఒకటి. మరి ఇంటర్నేషనల్ వైడ్ గా ఎప్పుడు నుంచో ఉన్న ఈ షో ఇండియాలోకి వచ్చి కూడా సూపర్ హిట్ అవ్వడం ఒకెత్తు అయితే..

ఇండియాలో మన తెలుగు నుంచి షో అతి పెద్ద హిట్ కావడం ఇంకో ఎత్తు. మరి తెలుగులో ఈ షో ఇప్పటివరకు 6 సీజన్ లు టీవిలో ఒక సీజన్ ఓటిటి లో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ కాగా ఇపుడు టెలివిజన్ లో ఏడవ సీజన్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి అంతా ఉల్టా పల్టా అంటూ కొత్తగా ప్లాన్ చేస్తుండగా.

ఫైనల్ గా ఈ సీజన్ లాంచ్ డేట్ ని ఇప్పుడు స్టార్ మా వారు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అవైటెడ్ సీజన్ ఈ సెప్టెంబర్ 3న లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఆరోజు సాయంత్రం 7 గంటలకి షో గ్రాండ్ కర్టెన్ రైజింగ్ స్టార్ట్ కాగా ఇక నెక్స్ట్ డే నుంచి అయితే సీజన్ రాత్రి 9 గంటల 30 నిమిషాలకి వీక్ డేస్ లో..

అలాగే వీకెండ్ లో శనివారం ఆదివారం 9 గంటల నుంచి ప్రసారం కానున్నట్టుగా సరికొత్త ప్రోమోతో కన్ఫర్మ్ చేశారు. దీనితో  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్ ఫైనల్ గా మొదలు కాబోతుంది అని చెప్పాలి. కాగా ఈసారి షో ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు.