బిగ్ అప్డేట్ : రామ్ చరణ్ కోసం ఆస్కార్ కంపోజర్ ఖరారు.!

టాలీవుడ్ సినిమా నుంచి గ్లోబల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ లైనప్ అయితే మరింత లెవెల్లో ఉండబోతుంది అని ఆల్రెడీ అందరికీ అర్ధం అయ్యిపోయింది. కాగా ఇప్పుడు రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తో మాసివ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత చరణ్ తన కెరీర్ 16వ సినిమాని అయితే దర్శకుడు బుచ్చిబాబు సాన కి ఇచ్చి షాక్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా పట్ల తాను మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని సినీ వర్గాల్లో టాక్. ఇంకా ఇదిలా ఉండగా ఈ సినిమాలో లెజెండరీ సంగీత దర్శకుడు ఆస్కార్ గ్రహీత అయినటువంటి ఏ ఆర్ రెహమాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది.

కానీ ఇప్పుడు ఇవాళ అఫీషయల్ గా బిగ్ క్లారిటీ వచ్చేసింది. ఈరోజు రహమాన్ బర్త్ డే కావడంతో ఇండియన్ సినీ సెలబ్రెటీలు విషెస్ చెప్తుండగా రామ్ చరణ్ కూడా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్కమ్ చేసాడు. దీనితో ఈ భారీ సినిమాకి ఏ ఆర్ రహమాన్ కన్ఫర్మ్ అయ్యిపోయాడు అని చెప్పాలి.

దీనితో ఈ సినిమాకి ఇపుడు మరింత గ్రాండియర్ వచ్చింది అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది వేసవి నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది.