Rakul: రకుల్ పెళ్లి కోసం సీక్రెట్ గా 10 కోట్లు పంపిన బడా పొలిటీషియన్.. అంత సీక్రెట్ గా ఎందుకబ్బా?

Rakul: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి రకుల్ ప్రీతిసింగ్ ఒకరు. ఇటీవల కాలంలో ఈమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. ఇక గత ఏడాది రకుల్ ఫిబ్రవరిలో నటుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇలా పెళ్లి తర్వాత కూడా ఈమె వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమెకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈమె పెళ్లి కోసం మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటూ వారితో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ నుండి దాదాపు 10 కోట్ల వరకు డబ్బులు హవాలా రూపంలో ఇచ్చినట్టు విచారణలో తెలిసింది.అయితే కేటీఆర్ చెప్పడం వల్లే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి 10 కోట్ల రూపాయలు ఇచ్చామన్నట్టు ఆ సంస్థ వాళ్ళు విచారణలో తెలిపినట్టు ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ పూర్తిగా ఫేక్ న్యూస్ అని అది ఎవరు నమ్మవద్దు అంటూ సజాగ్ టీం ఆ వార్తను పూర్తిగా ఖండించారు. అయితే అప్పట్లో కేటీఆర్ రకుల్ ప్రీతి గురించి ఎన్నో రకాల వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.