ఇండియన్ సినిమా నుంచి వరకు అయితే ఉన్న బిగ్గెస్ట్ గ్లోబల్ హిట్స్ లో యూనానిమస్ గా అయితే దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పాలి. కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన ఈ సినిమా మాసివ్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా సహా భారతీయ సినిమాకి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెట్టింది.
ఇక ఇదిలా ఉండగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు నెగ్గిన ఈ చిత్రం ఇపుడు ఇదే ఆస్కార్ అకాడమీ నుంచి మరో గౌరవాన్ని అయితే దక్కించుకుంది. లేటెస్ట్ గా ఆస్కార్ అకాడమీ వారు మొత్తం 398 మంది కొత్త సభ్యులని చేర్చుకోగా వారిలో ఈ చిత్రం నుంచి హీరో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లు అలాగే సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్ మరియు సాబు సిరిల్, సెంథిల్ అయితే జాయిన్ అయ్యారు.
దీనితో ఇది వెరీ ప్రైడ్ మూమెంట్ కాగా ఈ చిత్రం నుంచి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కి ఈ జ్యురీలో స్థానం దక్కకపోవడం ఒకింత షాకింగ్ అని చెప్పాలి. అసలు ఈ సినిమాకి క్యాప్టెన్ నే ఆయన అలాంటిది జక్కన్న పేరు లేకపోవడం అనేది ఊహించనిదే అని చెప్పాలి. మరి ఇది వరకు అయితే మన ఇండియన్ సినిమా నుంచి ఆస్కార్ సభ్యునిగా స్టార్ హీరో సూర్య ఉండగా ఇప్పుడు తనతో పాటుగా RRR సినిమా నుంచి ఇంతమంది ఇప్పుడు చేరారు.