Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్… రెండో వారంలో నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ వీళ్ళే!

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇలా ఫిబ్రవరి 26వ తేదీ ఈ కార్యక్రమం 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఒక వారం పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 16 మంది బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తున్నారు.

మొదటి వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే రెండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం ఏకంగా పదకొండు మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు. హౌస్ సభ్యులకు కంటెస్టెంట్ లు ఉన్న ఫోటోలు ఉన్న బాక్స్ లను ఇస్తూ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారు వారిపై డ్రాగన్ స్టిక్ చేయాలని సూచించాడు.అలాగే వారిని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పమని బిగ్ బాస్ వివరించారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ పలువురు కంటెస్టెంట్ లను నామినేట్ చేస్తూ వారిని నామినేట్ చేయడానికి కారణాలు కూడా తెలియజేశారు. మరి రెండవ వారంలో భాగంగా నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయానికి వస్తే…సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా నామినేట్ అయ్యారు ఈ 11 మందిలో గత వారంలో ఉన్నవారు కూడా రెండవ వారం లో నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి రానున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.