వైరల్ : రామ్ చరణ్ పేరుతో చిరంజీవి సినిమా ప్రమోషన్స్ 

కొడుకుని కన్నపుడు కాదు ఆ కొడుకు పెరిగి ప్రయోజకుడు అయినపుడు ఆ తండ్రికి అసలైన పుత్రోత్సాహం అంటారు పెద్దలు. అయితే ఈ సామెత కరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే తన వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లకి సరిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఇప్పటికే RRR చిత్రంతో చరణ్ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఫేమ్ తో మెగాస్టార్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియాలో కూడా జేమ్స్ కామెరాన్ లాంటి హాలీవుడ్ దర్శకుడు చరణ్ పాత్రని పొగడడంపై అసలైన పుత్రోత్సాహాన్ని తాను పంచుకున్నారు. అయితే లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మెగాస్టార్ నటించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” ని హిందీలో కూడా రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా హిందీ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రామ్ చరణ్ పేరునే నార్త్ లో వాడుతున్నారు. “RRR హీరో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ నటించిన సినిమా భోళా శంకర్” రిలీజ్ కాబోతుంది అని థియేటర్స్ దగ్గర హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి.

దీనితో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అన్న స్థాయికి ఇప్పుడు చరణ్ వెళ్ళాడు. దీనితో ఈ పిక్ మెగా ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా భోళా శంకర్ హిందీలో అయితే ఈ ఆగస్ట్ 25 న రిలీజ్ కాబోతుంది. 
https://twitter.com/ActualIndia/status/1693119784853098666?s=20