RRR:రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రచారాన్ని జనవరిలో పెద్ద ఎత్తున చేసిన చిత్ర యూనిట్ ఇపుడు అంత ఖర్చు పెట్టకుండా సినిమా విడుదలకు వారం ఉండగా మొదలుపెడుతోంది. ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరాయి. ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు గా మారుతున్నారు.
డివివి దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అందరు నమ్ముతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే ఎనిమిది వందల కోట్లకు చేరినట్లు సమాచారం. ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే నిర్మాత ఆర్ ఆర్ ఆర్ సినిమా ని అవుట్ రేట్ ధరకు అమ్మినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లో బిల్లా నాయక్ నిర్మాత నాగ వంశీ కూడా భాగస్వాములు అవుతున్నారట.
సినిమా కు సంబంధించిన ఆస్ట్రేలియా రిలీజ్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు ఆరు కోట్లకు పైగా వెచ్చించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారట.నాగ వంశీ రీసెంట్ గా డీజే టిల్లు సినిమా తో పాటు భీమ్లా నాయక్ తో కూడా భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా హడావిడి చూస్తూ ఉంటే 6 కోట్ల టార్గెట్ ను అందుకోవడం పెద్దగా కష్టం కాదని అనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడులకు అందరికీ కూడా ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ అందిస్తుంది అని కూడా అర్థమవుతుంది. కాబట్టి నాగ వంశీ కాతాలో ఇంకొక సక్సెస్ చేరుతుందని అర్థమైపోతోంది.