ఒకే ఒక్క సినిమాతో భారతీయ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఆమె. అదే ‘మై నే ప్యార్ కియా’. తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో రిలీజై సెన్సేషనల్ విజయం అందుకుంది. అప్పట్లో యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ ఒకే ఒక్క సినిమాతో ఆ ముద్దుగుమ్మ. ఎవరో తెలిసిపోయింది కదా. అందాల భామ భాగ్యశ్రీ. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు భాగ్యశ్రీ. ఈ మధ్యనే ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రబాస్‌కి తల్లిగా కనిపించి మెప్పించింది. ఈ అందాల భామకు ప్రిన్సెస్‌లాంటి కుమార్తె వుంది. ఆమె పేరు అవంతిక.
ప్రస్తుతం ఈ భామ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల సుందరి, ఇప్పుడు తెలుగులో ‘నేను స్టూడెంట్‌ని సార్’ అనే సినిమాతో డెబ్యూ చేస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు కానీ, అవంతిక పేరు మాత్రం టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. తల్లిని మించిన తనయ అవంతిక. అందంలోనే కాదు, అభినయంలో కూడా. ఎలాగూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది కదా. ఓ స్టార్ తనయుడు అవంతికపై కన్నేశాడట.
అయ్యో.! డబుల్ మీనింగ్ తీయొద్దు. తన సినిమాలో హీరోయిన్‌గా అవంతికను తీసుకోవాలనుకుంటున్నాడట. ఆయన మరెవరో కాదు, అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్. ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్న అఖిల్, తన తదుపరి సినిమాలో అవంతిక హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయాడట. కాస్త గట్టిగానే ప్రయత్నాలు కూడా మొదలెట్టాడట. ఈ విషయంలో ఇంకాస్త స్పష్టత రావల్సి వుంది. అయితే, కథల ఎంపికలో అవంతికకు మంచి విజన్ వుంది. సో, కంటెంట్ బాగుంటేనే అఖిల్ సినిమాకి ఓకే చెబుతుంది సుమా.!