సెట్లో భాగ్యశ్రీని ఇబ్బంది పెట్టిన సల్మాన్.. పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్న హీరోయిన్!

మైనే ప్యార్ కియా సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ. సుమన్ పాత్రలో ఆమె ఈ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించింది. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ఆకట్టుకుని స్టార్ హోదాని అందుకుంది. ఈ సినిమాలో ప్రేమ్ క్యారెక్టర్ లో నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. సల్మాన్ మరియు భాగ్యశ్రీ ఇద్దరూ “మైనే ప్యార్ కియా”లో కలిసి నటించినప్పుడు కొత్తవారే. రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం లో భాగ్యశ్రీ తొలిసారిగా నటిస్తోంది, సల్మాన్ ప్రధాన పాత్రలో నటించడం కూడా ఇదే మొదటిసారి.

గతంలో “బివి హో తో ఐసి”లో సహాయక పాత్రలో కనిపించినప్పటికీ ప్రేమ్, సుమన్ స్నేహితులుగా మొదలై చివరికి ప్రేమలో పడ్డారనేది ఈ సినిమా కథ. తాజాగా కోవిడ్ గుప్తా ఫిల్మ్స్ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, భాగ్యశ్రీ మైనే ప్యార్ కియా షూటింగ్ లో సల్మాన్ తన పక్కన కూర్చుని ఆమె చెవిలో పాట పాడటం ప్రారంభించినప్పటి సంగతులను గుర్తుచేసుకుంది. సల్మాన్ నా పక్కన కూర్చొని చెవిలో ఒక ప్రేమ పాట పాడాడు, ఆరోజు మొత్తం నా వెంటపడ్డారు.

సల్మాన్ ఎప్పుడూ సెట్‌లో పెద్దమనిషిగా ఉన్నందున, ఆ సమయంలో అతను ఒక గీతను దాటుతున్నట్లు అనిపించి, అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అని అయోమయంగా అనిపించింది. మొదట్లో, సల్మాన్ తనతో సరసాలాడుతున్నాడని ఆమె భావించింది, కాసేపటి తర్వాత ఆ ప్రవర్తన హద్దు మీరినట్లు అనిపించడంతో నేరుగా సల్మాన్ తో మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని కోప్పడ్డాను. అప్పుడు సల్మాన్ తనని పక్కకి తీసుకొని వెళ్లి నువ్వు ఎవరితో ప్రేమలో ఉన్నావో నాకు తెలుసు.

నీ లవర్ హిమాలయ గురించి కూడా నాకు తెలుసు అతనిని ఒకసారి సెట్ కి తీసుకు రావచ్చు కదా అన్నారు. అప్పుడు ఆయన ప్రవర్తనకి కారణం అర్థమైంది. నా రిలేషన్ గురించి అతనికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాను ఈ క్షణం తర్వాత, తనకు మరియు సల్మాన్ ఖాన్ మధ్య ప్రత్యేక బంధం ఏర్పడిందని నటి వెల్లడించింది. ఆమె పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, సల్మాన్ మరియు దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఆమెకు అండగా నిలిచారని కూడా చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.