పవన్ విషయంలో బండ్ల చెప్పిన ఆ డాలర్ శేషాద్రి ఎవరు?

టాలీవుడ్ లో ఉన్న నిర్మాతలు అలాగే నటుల్లో బండ్ల గణేష్ కూడా ఒకరు. మరి బండ్ల గణేష్ కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని పైగా భక్తుడు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కి తాను దూరంగానే ఉంటున్నాడు. ముందు చేసినంత జపం అయితే తాను పెద్దగా చేయడం లేదు.

దీనితో పవన్ ఫ్యాన్స్ లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆ మధ్య తన ఆడియో కాల్స్ లీక్ అవ్వడం ఇలా అనేక తలనొప్పులు అయితే ఎదురయ్యాయి. కాగా లేటెస్ట్ గా బండ్ల గణేష్ ముందు మళ్ళీ పవన్ ప్రస్తావన అభిమానులు సోషల్ మీడియాలో తీసుకురాగా తాను ఇప్పుడు ఓ షాకింగ్ రిప్లై ఇవ్వడం సస్పెన్స్ గా మారింది.

పవన్ నుంచి ఎందుకు దూరంగా ఉన్నావు అని అడగ్గా దేవుడు మంచి వాడే కానీ డాలర్ శేషాద్రి తోనే ప్రాబ్లమ్ ఏం చేద్దాం బ్రదర్ అంటూ బదులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ డాలర్ శేషాద్రి ఎవరు పవన్ ని బండ్ల గణేష్ ని కలవకుండా ఎందుకు అడ్డు పడుతున్నాడు అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి.

అయితే దీనికి సమాధానం చాలా మంది మరోసారి త్రివిక్రమ్ అనే అంటున్నారు. దీనితో బండ్ల గణేష్ ట్వీట్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక మరో పక్క పవన్ అయితే వినోదయ సీతం రీమేక్ అలాగే నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.