వైరల్ : బండ్ల గణేష్ ని విసిగిస్తున్న పవన్ ఫ్యాన్స్..!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలతో పాటుగా రాజకీయాల్లో మళ్ళీ మంచి యాక్టీవ్ గా మారారు. ఇక ఇప్పుడు అయితే భారీ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ లో తాను పాల్గొనగా ఇప్పుడు మరో వారం రోజుల పాటు భారీ ఏక్షన్ సీక్వెన్స్ ని పవన్ చేయనున్నాడు.

ఇక ఇదిలా ఉండగా మరోపక్క సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేసే రచ్చ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అయితే వీళ్లందరి కన్నా పెద్ద ఫ్యాన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది నిర్మాత బండ్ల గణేష్ అనే చెప్పాలి. మరి బండ్ల గణేష్ గాని పవన్ ఆడియో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని వస్తే అది రచ్చ వేరే లెవెల్ కి వెళ్తుంది.

అయితే ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ విషయంలో తన ఫోన్ కాల్ ఒకటి లీక్ కావడం పెద్ద రచ్చ అయ్యింది. మరి దీనిపై లేటెస్ట్ గా ఫన్నీ వీడియోని బండ్ల గణేష్ మరియు త్రివిక్రమ్ పై గాడ్ ఫాదర్ లో ఎంట్రీ సీన్ తో పవన్ ఫ్యాన్స్ చేశారు. దీనితో ఇది మంచి వైరల్ గా మారగా దానిని చూసి బండ్ల గణేష్ విస్తుపోయి తన స్పందన తెలియజేసాడు.

“ప్లీజ్ జోక్స్ చెయ్యకండి ఇది నా రిక్వెస్ట్” అంటూ పవన్ ఫ్యాన్స్ కి బండ్ల గణేష్ రిప్లై ఇచ్చాడు. దీనితో ఆ నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించేసాడు. అయితే సోషల్ మీడియాలో మంచి ఆక్టివ్ గా బండ్ల సదరు పవన్ ఫ్యాన్స్ వల్లే ఇప్పుడు విస్తుపోయి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యిందని చెప్పాలి.