సడెన్ గా మళ్ళీ రూటు మార్చిన బండ్ల..!

1106142-bandla-ganesh

టాలీవుడ్ సినిమా దగ్గర ప్రముఖ నటుడు అలాగే నిర్మాత అయినటువంటి మాస్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కోసం అందరికీ తెలిసిందే. మరి అలాగే బండ్ల గణేష్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా తాను వీరాభిమాని అని కూడా తెలిసిందే. అయితే బండ్ల గణేష్ ఇపుడు సినిమాల్లో ఇప్పుడు అంత బిజీగా లేదు కానీ తన బిజినెస్ పనుల్లో ఉన్నాడు.

పైగా సోషల్ మీడియాలో కూడా ముందు అంత యాక్టీవ్ గా లేడు కానీ ఇప్పుడు సడెన్ గా తాను పెట్టిన పలు ట్వీట్ లు మళ్ళీ షాకింగ్ గా మారాయి. గతంలో బండ్ల గణేష్ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత అక్కడ దెబ్బకు ఇక మళ్ళీ పాలిటిక్స్ లోకి రాను అని ఎన్నో కామెంట్స్ చేసి నన్ను ఎవరు ఈ రాజకీయాల్లోకి కూడా లాగొద్దు అని ఖరాకండి గా చెప్పేసారు.

అయితే లేటెస్ట్ గా మళ్ళీ ఎందుకో రూటు మార్చి తన పొలిటికల్ లైఫ్ పై నిర్ణయాన్ని అతి త్వరలోనే ప్రకటన ఇస్తానని షాకింగ్ పోస్ట్ లు పెట్టాడు. అయితే ఇది తెలంగాణలోనేనా లేక ఏపీ రాజకీయాల్లో చేరుతాడా అనేది ఆసక్తిగా మారింది.

మరో పక్క తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు పలు కామెంట్స్ చేస్తున్న సమయంలోనే బండ్ల గణేష్ కూడా ఈ ఊహించని పోస్టులతో రావడంతో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ జనసేన లో చేరుతాడు అని అనుకుంటున్నారు. కానీ ఫైనల్ గా బండ్ల అయితే ఏం చేస్తాడో చూడాలి.