నిర్మాతగా మారిన బాలయ్య చిన్న అల్లుడు… డైరెక్టర్ అతనేనా?

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు నిర్మాతలుగా సొంత బ్యానర్లో పెద్ద ఎత్తున సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. అయితే నందమూరి కుటుంబంలోకూడా ఎన్నో నిర్మాణ సంస్థలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే బాలయ్య వారసులుగా ఎవరు కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.బ్రాహ్మినికి ముందు నుంచి సినిమాలు అంటే పూర్తిగా ఆసక్తి లేకపోవడంతో ఈమె బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారు. ఇక త్వరలోనే బాలకృష్ణ కుమారుడు కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఇక బాలకృష్ణ రెండవ కుమార్తెకు సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఈమె తెరపై కాకుండా తెర వెనుక సినిమా వ్యవహారాలను చూస్తూ ఉన్నారు.గత కొంతకాలంగా బాలకృష్ణకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉండడమే కాకుండా ఆయన సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తేజస్విని దగ్గర ఉండి చూసుకుంటున్నారట.ఇలా సినిమాలపై ఎంతో పట్టు ఉన్నటువంటి తేజస్విని ఏకంగా తన భర్తతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

తేజస్విని భర్త భరత్ గీతం విద్యాసంస్థలకు అధినేత అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తేజస్విని భరత్ ఇద్దరూ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని భావించారట.అదేవిధంగా బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో 14 రీల్స్ మీడియాతో పాటు తేజస్విని కూడా 20 శాతం పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలయ్య చిన్న కుమార్తె అల్లుడు సిద్ధమైనట్లు తెలుస్తోంది.