Balakrishna : మళ్ళీ అన్ స్టాపబుల్ అంటున్న బాలయ్య… సీజన్ 2 పనులు షురూ…!

Balakrishna : బాలయ్యబాబు ఈ ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బోయపాటి బాలయ్య నాలుగోసారి జత కట్టిన ఈ సినిమా కరోనా వల్ల డీలా పడిన థియేటర్లకు మళ్ళీ ఊపిరి పోసింది. ఇక ఈ సినిమా ఘన విజయంతో పాటు బాలయ్య ఈ ఏడాది మొదటి సారి హోస్ట్ గా షో రన్ చేసాడు. అల్లు అరవింద్ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఆహా ఒరిజినల్స్ లో అన్ స్టాపబుల్ షో చేసాడు.

ఇక ఈ షో మామలుగా హిట్ కాలేదు. ఏకంగా ఇండియన్ టాప్ షోస్ లో నిలిచింది. IMDb రేటింగ్స్ లో 9రేటింగ్ తో అందరిని ఆశ్చర్య పరిచింది. ఇంత వరకు ఇండియా ను డి ఏ షో కి ఇంత రేటింగ్ ను iMDb ఇవ్వలేదు. ఇక IMDb టాప్ 50 గ్లోబల్ షోస్ నుండి టాప్ 18 ప్లేసులో నిలిచి రికార్డులు బద్దలు కొట్టింది. ఏదేమైనా బాలయ్య దిగనంత వరకే అన్నట్టుగా అన్ స్టాపబుల్ సాగింది. మోహన్ బాబు తో మొదలైన కార్యక్రమం మహేష్ బాబుతో ముగిసింది.

ఇక ఇపుడు రెండో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి సీజన్ కన్నా మరింత మెరుగ్గా రెండవ సీజన్ ఉండనుంది. ఇక రెండవ సీజన్ కోసం అతిధుల లిస్ట్ ను కూడా సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ సీజన్ లో చిరంజీవి, ప్రభాస్, వెంకటేష్ వంటి హీరోలు లిస్ట్ లో ఉన్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసి ఈ సీజన్ కు సిద్దమవుతాడని సమాచారం. ఇక ఈ సీజన్లో బాలయ్య ఎలా అలరిస్తాడో ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్స్ చేస్తాడో వేచి చూడాల్సిందే.