“భగవంత్ కేసరి”లో బాలయ్య సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ 

ఇప్పుడు దసరా కానుకగా టాలీవుడ్ లో రాబోతున్న సినిమాల సందడి అయితే ఓ రేంజ్ లో మొదలైంది. ఎవరికి వారు తమ చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉండగా ఆ చిత్రాల్లో మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఇప్పటికే మంచి అంచనాలు ఈ సినిమా ట్రైలర్ తో తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ అంశాలు షేర్ చేసుకున్నాడు.

అంతే కాకుండా ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ సాంగ్ ని అయితే దసరా కానుకగా యాడ్ చేస్తున్నామని కూడా తెలిపాడు. మరి ఆ సాంగ్ ఏంటి అనేది ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఆ సాంగ్ మరేదో కాదట బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ సాంగ్ అయినటువంటి దంచవే మేనత్త కూతురా సాంగ్ ని రీమిక్స్ చేసి రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

అలాగే ఈ సాంగ్ అయితే ఈ అక్టోబర్ 24 నుంచి థియేటర్స్ లో యాడ్ చేస్తారని సమాచారం. మొత్తానికి అయితే ఒక మాస్ బొనాంజాతో చిత్ర యూనిట్ రాబోతున్నారు అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మరో హీరోయిన్ శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ లో నటించింది.