ఇండస్ట్రీ టాక్ : “బిగ్ బాస్” కోసం బాలయ్య షాకింగ్ మొత్తం ఛార్జ్ చేస్తున్నాడా?

balakrishna-manisoon

ఇప్పుడు టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో తెరకెక్కిస్తున్న భారీ మాస్ ఏక్షన్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాపై మాస్ లో మంచి అంచనాలు నెలకొనగా దీనితో పాటుగా బాలయ్య తన ఫస్ట్ టాక్ ఓటిటి షో అన్ స్టాప్పబుల్ లో కూడా బిజీగా ఉన్నారు.

ఇక వెండితెర మొబైల్ స్క్రీన్స్ పై అలరించిన బాలయ్య స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటివంటి బిగ్ బాస్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా కొన్ని పుకార్లు అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఆల్ మోస్ట్ బిగ్ బాస్ కోసం బాలయ్య రెడీనే అన్నట్టుగా టాక్ మొదలు కాగా అక్కడ నుంచి అయితే నెక్స్ట్ సీజన్ పై మరింత ఆసక్తి అందరిలో రేగింది. ఇక ఇక్కడ నుంచి మరో ఇంట్రెస్టింగ్ టాక్ సినీ వర్గాల్లో బాలయ్య ఛార్జ్ చేసే రెమ్యునరేషన్ కోసం వినిపిస్తుంది.

ఈ సీజన్లో బాలయ్య అయితే 10 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చని మరో భోగట్టా.. దీనితో అయితే బాలయ్య స్మాల్ స్క్రీన్ ఎంట్రీ కూడా బ్యాంగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ సీజన్లో బాలయ్య కనిపిస్తారో లేదో అనేది ఇంకా అధికారికంగా అనౌన్స్ కావాల్సి ఉంది.