ఇపుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెయిన్ గా సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది బిగ్ స్టార్స్ అయితే వచ్చే రోజుల్లో కలిసి పని చేస్తుండగా పవన్ కళ్యాణ్ మరియు నందమూరి బాలకృష్ణ లు అయితే వారు వారి పార్టీల తరపున కలిసి పని చేస్తున్నారు.
అయితే వీరు కలవడానికి మెయిన్ కారణం ఏదన్నా ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని అందరికీ తెలిసిందే. కాగా ఈ అరెస్ట్ విషయంలో నందమూరి నారా కుటుంబం నుంచి నటులు హీరోలు కొందరు స్పందించారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాని అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ లు మాత్రం ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
అయితే చరిష్మా పరంగా ఎన్టీఆర్ క్రేజ్ వేరు కాబట్టి ఎన్టీఆర్ స్పందన అనేది ఆసక్తిగా మారింది. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ మౌనంగా ఉండడంతో నందమూరి అభిమానుల్లోనే కలవరం తెచ్చి పెట్టింది. కాగా ఎన్టీఆర్ స్పందన విషయంలో అయితే మీడియా ముఖంగా బాలయ్యపై ఎన్టీఆర్ కోసం ప్రస్తావన వచ్చింది.
ఎన్టీఆర్ గారు ఎందుకు ఇంకా స్పందించలేదు అని అడగ్గా “బ్రో ఐ డోంట్ కేర్” అంటూ తన భగవంత్ కేసరి సినిమా టాగ్ లైన్ ని బాలయ్య చెప్పడం ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇప్పటికే బాలయ్య ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ ఉందని అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ విషయంలో బాలయ్య ఇప్పుడు ఈ తరహాలో కామెంట్స్ చేయడం పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కం టీడీపీ అభిమానులు అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.