ఆల్రెడీ వచ్చే ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి రేస్ మంచి హీట్ ఎక్కిపోయింది. నిన్ననే నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రం వీరసింహా రెడ్డి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. ఇక ఈ చిత్రాన్ని అయితే వరల్డ్ వైడ్ జనవరి 12 న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.
మొదటిలో అయితే చిరు బాలయ్య ఒకేరోజు వచ్చే ఛాన్స్ ఉందని బజ్ బయటకి వచ్చింది కానీ ఇప్పుడు అయితే పోటీ బాలయ్య వర్సెస్ తమిళ హీరో విజయ్ తో పడింది. ఆల్రెడీ విజయ్ వారిసు కూడా వచ్చే ఏడాది జనవరి 12 కే అని ఫిక్స్ అయ్యింది.
దీనితో సరిగ్గా ఇదే డేట్ ని అయితే మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేయగా మాసివ్ లెవెల్లో మారింది. ఇక దీనితో ఈ ఇద్దరి మధ్య యుద్ధంలో తెలుగులో మాత్రం బాలయ్య విజయ్ సినిమాని మొదటి రోజు తొక్కేస్తాడని అంటున్నారు. కానీ మరో పక్క మాత్రం వారసుడు సినిమాని కూడా దిల్ రాజు తెలుగు స్టేట్స్ లో తక్కువ థియేటర్స్ లో అయితే రిలీజ్ చెయ్యరని చెప్పేసాడు.
దీనితో ఆ సినిమాకి ఓపెనింగ్స్ ఎలా ఉన్నా థియేటర్స్ మాత్రం బాగానే దక్కుతాయని చెప్పొచ్చు కానీ వీర సింహా రెడ్డి మాత్రం వసూళ్ల పరంగా డెఫినెట్ గా ఎక్కువ రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి ఆరోజు ఎలా ఉంటుందో చూడాల్సిందే.