ఇండస్ట్రీ టాక్ : చిరు దెబ్బకి బాలయ్య సినిమా తీసేస్తున్నారా?

ఈ ఏడు సంక్రాంతి కానుకగా భారీ అంచనాలు మధ్య టాలీవుడ్ లో వచ్చి భారీ హిట్స్ గా అన్ని సినిమాలు కూడా నిలిచాయి. కానీ వాటిలో ఫైనల్ గా మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానే పై చేయి సాధించడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అంటే ఈ సినిమాపై కూడా హైప్ ఉంది. కానీ మొదటి రోజు మాత్రం వరల్డ్ వైడ్ గా కూడా బాలయ్య వీరసింహా రెడ్డి సినిమాపై అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది పైగా వీరయ్య సినిమా కన్నా వీరసింహా రెడ్డి వసూళ్లే ఎక్కువ వచ్చాయి.

మరి ఇలా మొదట బాలయ్యే డామినేట్ చేయగా నెక్స్ట్ మాత్రం ఉండి ఉండి మెగాస్టార్ తన సత్తా చూపించాడు. తనకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో ఆ లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో చిరు చూపించారు. దీనితో గ్రౌండ్ లో మాత్రం వాల్తేరు వీరయ్య కి ఇప్పటికీ షోస్ ఫుల్ అవుతూ ఉన్నాయి.

కానీ వీరసింహ రెడ్డి కి సింపుల్ గా టికెట్స్ దొరికేస్తున్నాయి. దీనితో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాల్తేరు వీరయ్య కి ఎదురు లేకుండా పోయింది. దీనితో పాటుగా చాలా ఏరియాల్లో వీరసింహా రెడ్డి బాగా డ్రాప్ అవుతూ ఉండడంతో వాల్తేరు వీరయ్య సినిమాతో రీప్లేస్ చేస్తున్నారట. దీనితో చిరు దెబ్బకి మాత్రం బాలయ్య సినిమా తీసేయాల్సి వస్తుంది అని ట్రేడ్ వర్గాల్లో టాక్.