“భగవంత్ కేసరి” వసూళ్లతో బాలయ్య బ్లాస్టింగ్ రికార్డు..!

మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం భగవంత్ కేసరి కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అనీల్  రావిపూడితో చేసిన ఈ సినిమా అయితే బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా ఇంట్రెస్టింగ్ గా వీక్ డేస్ లోకి వచ్చాక కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్స్ ని పెడుతుంది.

మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో బాగా రన్ అవుతున్న ఈ చిత్రంతో ఇపుడు బాలయ్య ఓ బ్లాస్టింగ్ రికార్డు కొట్టినట్టుగా సినీ వర్గాలు సినిమా నిర్మాణ సంస్థ కూడా అనౌన్స్ చేసింది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యిన ఆరవ రోజుకి వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాసింగ్ క్లబ్ లోకి చేరగా..

దీనితో బాలయ్య నటించిన గత రెండు చిత్రాలు అఖండ మరియు వీరసింహా రెడ్డి చిత్రాలు సరసన వరుసగా 100 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాగా నిలిచింది. అంతే కాకుండా మన సీనియర్ హీరోస్ లో వరుసగా 100 కోట్ల గ్రాస్ అందుకున్న మరో హీరోగా బాలయ్య ఇపుడు నిలిచాడు.

అయితే ఇప్పుడు సినిమా సుమారు 50 కోట్ల మేర షేర్ ని రాబట్టగా మరో 20 కోట్ల మేర షేర్ ని అందుకుంటే హిట్ జాబితా లోకి వెళ్ళిపోతుంది. మరి భగవంత్ కేసరి కూడా హిట్ లిస్ట్ లోకి వెళ్తుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. 
https://x.com/Shine_Screens/status/1717116768915960114?s=20