బుల్లితెరపై మాత్రం డిజాస్టర్ అయ్యిన “వాల్తేరు వీరయ్య”..!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో టాలీవుడ్ మాస్ మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవి తోనే మొదటి హిట్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి అయితే భారీ లాభాలని అందించిన ఆ చిత్రమే “వాల్తేరు వీరయ్య”.

యంగ్ దర్శకుడు అలాగే మెగా ఫ్యాన్ అయినటువంటి బాబీ తెరకెక్కించిన ఈ సినిమా మంచి లాభాలు అందుకోగా థియేటర్స్ సహా ఓటిటి లో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి ఈ చిత్రం రీసెంట్ గానే దసరా ప్రీమియర్ గా అయితే తెలుగు స్మాల్ స్క్రీన్ పై మొట్టమొదటి సరిగా టెలికాస్ట్ కాగా బుల్లితెరపై మాత్రం ఫెయిల్ అయ్యింది అని చెప్పాలి.

ఈ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఆడియెన్స్ కేవలం అంటే కేవలం 5.14 టీఆర్పీ రేటింగ్ ని మాత్రమే అందుకుంది. ఇది మాత్రం డిజాస్టర్ అని చెప్పాలి. దీనికన్నా పరమ యావరేజ్ చిత్రం అయ్యిన బీతో సినిమాకే మొన్న 6 కి పైగా రేటింగ్ వచ్చింది.

మరి అలాంటిది మెగాస్టార్ లాంటి హీరో పైగా మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉండి థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అయినప్పటికీ స్మాల్ స్క్రీన్ పై ఇంత తక్కువ రెస్పాన్స్ అందుకోవడం అనేది షాకింగ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.