అత్యుత్వాహం కనబరచిన బాలయ్య ఫ్యాన్స్.. ఏఎంబి సినిమాస్ కు భారీ డ్యామేజ్?

సాధారణంగా తమ అభిమాన హీరోలు ఫలానా వేడుకకు హాజరవుతున్నారని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటారు. ఇలా అభిమానులు తమ అభిమాన హీరోని చూడటం వారితో సెల్ఫీలు తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ అభిమానుల సైతం తమ అభిమాన హీరోని చూడటం కోసం అత్యుత్సాహం కనబరిచారు. ఈ క్రమంలోనే ఏఎంబి సినిమాస్ కి భారీగా డామేజ్ జరిగింది. తాజాగా విశ్వక్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దాస్ కా దమ్కీ.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఏఎంబి సినిమాస్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు

ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడిని చూడటం కోసం ముందుగా వెళ్లాలన్న ఆత్రుతతో థియేటర్ బయట ఉన్నటువంటి షటర్‌ను బాలయ్య ఫ్యాన్స్ డ్యామేజ్ చేసారు. సెక్యూరిటీ సిబ్బంది షటర్‌ను ఎత్తుతుండగా ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో షట్టర్ మొత్తం దెబ్బతినిందని అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా అభిమాన హీరోల సినిమాలు విడుదల అవుతున్న సమయంలో అలాగే వారిని చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు థియేటర్ల సీట్లు చింపేయడం అద్దాలు విరగొట్టడం వంటివి చేయడం కొత్తేమీ కాదని ఇలాంటివి ఎప్పటినుంచో జరుగుతూ ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.