Balayya : ఊహించని కాంబోలో బాలయ్య నెక్స్ట్ సినిమా..కూతురిగా ఈ యంగ్ హీరోయిన్!

Balayya : ఇప్పుడు టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోల లైనప్ లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు సహా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరు బాలయ్య నాగ్ మరియు వెంకీ మామల సినిమాలు రాబోయే రోజుల్లో భారీ ట్రీట్ ఇవ్వనున్నాయి. ఇక ఈ లిస్ట్ లో నందమూరి కృష్ణ లైనప్ అయితే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఉందని చెప్పాలి.

అప్పుడెప్పుడో 2000 సంవత్సరాలలో వరుస హిట్స్ తో అదిరే సినిమాలు బాలయ్య చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు తలపించేలా సూపర్ లైనప్ ని తాను సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా “అఖండ” సినిమాతో తన కెరీర్ లో భారీ హిట్ ని అందుకొని నెక్స్ట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఇంకో మాసివ్ సినిమాని ప్లాన్ చేసాడు.

దీని నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వేరే లెవెల్లో అదరగొట్టగా ఇప్పుడు తన మరో సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఊహించని టాక్ వైరల్ అవుతుంది. దీని తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి తో ఓ సినిమా కూడా ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈ సినిమాని అనీల్ మామూలుగా ప్లాన్ చేయట్లేదట.

ఈ సినిమాకి గాను సంగీత దర్శకుడు అనిరుద్ ని రంగంలోకి దించనున్నారని తెలుస్తుంది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో లేటెస్ట్ యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా కనిపిస్తుందట. ఈమె బాలయ్యకి కూతురుగా కనిపిస్తుందని తెలుస్తుంది. దీనితో ఇది ఒక ఊహించని కాంబో లా మారిందని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ కోసం అంతా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు.