గాసిప్స్ : బాలయ్య – పూరి ప్రాజెక్ట్ కి యాప్ట్ మాస్ టైటిల్.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు క్రేజీ అండ్ అదిరే మాస్ కాంబినేషన్స్ లో మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ కాంబోలో వచ్చిన మొదటి సినిమానే “పైసా వసూల్” కాగా ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి రిలీజ్ డే వరకు కూడా క్రేజీ హైప్ సొంతం చేసుకుంది. కానీ సినిమాలో మేటర్ లేకపోయేసరికి హిట్ అవ్వలేదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా ఆడియెన్స్ లో మాత్రం ఈ కాంబినేషన్ నుంచి ఇంకో సరైన సినిమా పడితే చూడాలి అనుకుంటున్నారు.

మరి లేటెస్ట్ గాసిప్స్ ఏమిటంటే డెఫినెట్ గా ఈ కాంబినేషన్ లో సినిమా ఉందట. ఇపుడు బాలయ్య చేస్తున్న 108వ సినిమా తర్వాత మరిన్ని చిత్రాలు ఓకే చేయగా వాటిలో పూరి తో కూడా సినిమా ఉందని తెలుస్తుంది. అంతేనా.. ఈ సినిమాకి ఒక మాస్ టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

మరి ఈ టైటిల్ అయితే “కాకా” అట. ఈ పేరును చాలా సినిమాల్లో మనం విని ఉంటాం. ఒక డాన్ లాంటి పర్సనాలిటీకి లేదా ఓ హెడ్ పర్సనాలిటీ కి ఈ టైటిల్ యాప్ట్ అవుతుంది. అంటే ఈసారి పూరి బాలయ్య సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడని అర్ధం అవుతుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది చూడాలి.