కాపీ ట్యూన్.! తమన్‌కి బాలయ్య చీవాట్లు.?

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై బాలయ్య నజర్..! పాటొచ్చింది. అభిమానులు పండగ చేసుకున్నారు. ఆ తర్వాత అసహనం వ్యక్తం చేశారు. ఆ పై ఏకి పారేస్తున్నారు. నందమూరి నటసింహం బాలయ్య కొత్త సినిమా ‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రకంపన ఇది. ఈ సినిమాలోని ‘జై బాలయ్యా..’ అంటూ సాగే సాంగ్ ఇటీవల చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

‘ఆహా.! ఓహో.! అంటూ ఈ సాంగ్‌ని మొదట అద్భుతమని కొనియాడిన అభిమానులు.. ఆ తర్వాత పెదవి విరిచేసరికి బాలయ్యకు కోపమొచ్చిందట. బాలయ్య కోపం సంగతి తెలిసిందే కదా. తమన్‌కి ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాడట. మిగతా పాటలైనా ఒరిజినలా.? అవి కూడా కాపీయేనా.? అని తిట్టిపోశాడట.! పాపం థమన్ ఏం చేస్తాడు.? అసలే ఈ మధ్య థమన్ ట్యూన్ల విషయంలో ఇవే విమర్శలు వెల్లువెత్తుతున్నాయాయె.

అందరి విషయంలోనూ చెల్లుద్ది కానీ, అక్కడున్నది బాలయ్య. తేడా కొట్టిందో దబ్బిడి దిబ్బిడే. కూసింత ఒళ్లు గట్టిగానే దగ్గర పెట్టుకోవాలి కదా థమన్ భయ్యా.! అంటూ థమన్ అభిమానులు ఉచిత సలహాలిస్తున్నారట. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ కూడా తమన్ విషయంలో గుస్సా అవుతున్నారంట. ఈ డ్యామేజ్‌ని కవర్ చేసుకోవాలంటే, తదుపరి పాటల విషయంలో థమన్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి వుంది మరి.