Balakrishna : హనుమాన్ డైరెక్టర్ తో బాలకృష్ణ క్రేజీ కాంబో..!

Balakrishna : నందమూరి నటసింహం తో పని చేసిన ఎవరైనా మళ్ళీ వర్క్స్ చేయాలని ఎదురుచూస్తుంటారు ఆయన ఇమేజ్ ను పక్కన పెట్టి దర్శకుడు చెప్పినట్టు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇక సినిమాలో పాత్ర కోసం ఏదైనా చేస్తారు బాలయ్య బాబు అందుకే ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటారు డైరెక్టర్స్.

ఇక ఈ మధ్య అఖండ సినిమాతో మళ్ళీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లోనూ చరిత్ర సృష్టించారు. అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎవరు షో మొదటి ప్రోమోకు దర్శకత్వం వహించింది హునుమాన్, జాంబి రెడ్డి సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. మొదటి ప్రోమోతోనే సెన్సేషన్ సృష్టించింది.

ప్రశాంత్ వర్మ ప్రోమో షూటింగ్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ ను కలవలేదంట అయితే ఇటీవల ప్రశాంత్ వారం సినిమా సెట్ పక్కనే బాలయ్య బాబు సినిమా షూటింగ్ జరుగుతుండడం తో ఆయన కలిసి మాట్లాడారాట. నీ హస్తవాసి మంచింది, నీతో కలిసి మళ్ళీ కచ్చితంగా వర్క్స్ చేస్తానని అన్నారట. ఈ మాటలు తనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని ప్రశాంత్ చెప్పారు.ఆయనతో వర్క్స్ చేయడం ద్వారా ఆయన నిజంగా ఎలా ఉంటారో తెలిసిందని తన కొత్త సినిమా హనుమాన్ కోసం వాకబు చేసారని ప్రశాంత్ చెప్పారు.

ఇక బాలయ్య అభిమానులు కూడా ప్రోమో విడుదలయ్యాక సోషల్ మీడియా వేదిక గా చాలా సార్లు ప్రశాంత్ ను బాలకృష్ణ తో వర్క్స్ చేయమని అడగటం కొసమెరుపు. ఇక ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.