RRR, KGF 2 తర్వాత “బేబీ”నే సంచలన రికార్డ్.!

తెలుగు ఇండస్ట్రీలో ఓ సినిమా హిట్ అయితే దాని రన్ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. అది భారీ చిత్రం అయ్యిన చిన్న సినిమా అయినప్పటికీ కూడా కంటెంట్ కనెక్ట్ అవ్వాలి కానీ తెలుగు ఆడియెన్స్ ఆ చిత్రాలని నెత్తిన పెట్టుకుంటారు. మరి అలా రీసెంట్ గా వచ్చిన ఓ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ ఊహించని ఆదరణతో అయితే భారీ వసూళ్లు అందిస్తున్నారు.

మరి ఆ సినిమానే “బేబీ”. తిప్పి కొడితే 5 కోట్లు బడ్జెట్ కూడా ఉండని ఈ చిత్రం ఇప్పుడు 70 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి ఈ ఏడాది భారీ లాభాలు ఇచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఏ సినిమాకి అయినా ఓపెనింగ్స్ తర్వాత లాంగ్ రన్ చాలా ముఖ్యం మరి ఈ లాంగ్ రన్ లో అయితే పాన్ ఇండియా చిత్రాలు ట్రిపుల్ ఆర్(RRR) అలాగే కేజీఎఫ్ 2 లాంటి సెన్సేషనల్ చిత్రాల జాబితాలో ఇప్పుడు బేబీ చిత్రం నిలవడం ఓ బిగ్ థింగ్ గా మారింది.

కాగా సినిమా రిలీజ్ అయ్యి పన్నెండవ రోజు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి రూపాయలకి పైగా షేర్ ని రాబట్టిన మూడవ చిత్రంగా ఇప్పుడు బేబీ రికార్డులకెక్కింది. కాగా తెలుగు స్టేట్స్ లో ఈ సంచలన రికార్డు ఉన్న మొదటి రెండు చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 లు అయితే వాటి తర్వాత నిలిచిన ఏకైక చిత్రంగా బేబీ ఇప్పుడు నిలిచింది.

మరి ఈ ఫీట్ అందుకోవడం ఓ చిన్న సినిమాకి సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. కాగా ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ లు హీరోలుగా నటించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అలాగే కలర్ ఫోటో చిత్రం రచయిత సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.