వసూళ్లతో కుమ్మేస్తున్న “బేబీ”..ఇదెక్కడి మాస్ బాటింగ్ 

ఈ జూలై నెలలో రిలీజ్ కి వచ్చిన టాలీవడో లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “బేబీ” కూడా ఒకటి. బహుశా ఈ నెలలో ఇప్పటికి ఇదే పెద్ద హిట్ అని కూడా చెప్పాలి.

అయితే ప్రీమియర్స్ తోనే సాలిడ్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం నెక్స్ట్ భారీ జంప్ తో ఇక బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల బాటింగ్ స్టార్ట్ చేసి మొదటి వారం రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే మొదటి వారానికి 49.3 కోట్లు గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం 8వ రోజు రాత్రికి 50 కోట్ల మార్క్ ని కొట్టేసింది.

అయితే బేబీ మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ లోకి అడుగు పెడుతూనే ఈ మొత్తం 8 రోజుల్లో ఏకంగా 54 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దీనితో బేబీ మన టాలీవుడ్ లో మిడ్ రేంజ్ చిత్రాల్లో అయితే ఫాస్టెస్ట్ 54 కోట్ల గ్రాసర్ గా నిలిచింది అని చెప్తున్నారు. అయితే ఈ వసూళ్లు చూస్తుంటే బేబీ హవా ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని కూడా చెప్పాలి.

ఇక నెక్స్ట్ బ్రో చిత్రం వచ్చాక కొంచెం స్లో అవ్వొచ్చు ఏమో కానీ లాంగ్ రన్ లో అయితే ఈ చిత్రం 70 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. మొత్తానికి అయితే బేబీ మాస్ బాటింగ్ ఇలా నడుస్తుంది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా ఎస్ కె ఎన్ మరియు దర్శకుడు మారుతీ లు నిర్మాణం వహించారు. అలాగే రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గా చిత్ర యూనిట్ అందరికీ ఓ పార్టీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.