‘బాబు నెం.1 బుల్‌ షిట్‌ గయ్‌.. 8న విడుదలకు సన్నాహాలు!

బిగ్‌ బాస్‌ ఫేం, యంగ్‌ ట్యాలెంటెడ్‌ అర్జున్‌ కళ్యాణ్‌, కుషితకల్లపు హీరో హీరోయిన్స్‌గా లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం1 బుల్‌ షిట్‌ గయ్‌’. డీడీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దండు దిలీప్‌ కుమార్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్‌ కంటెంట్‌ కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ ను ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ , దర్శకుడు సాయిరాజేష్‌, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల విడుదల చేశారు.

సందర్బంగా సాయి రాజేష్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్‌ అద్భుతంగా అనిపించింది. ఒకే ట్రైలర్‌ లో విభిన్న ఎమోషన్స్‌ ని చూపించడం బావుంది. సినిమాకి చాలా మంచి పాజిటివ్‌ బజ్‌ వుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.

హీరో అర్జున్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ : యూనిక్‌ కాన్సెప్ట్‌ తో థ్రిల్లర్‌, డ్రామాగా రూపొందిన చిత్రమిది. చాలా కష్టపడి మూడు భాషల్లో ఈ సినిమా చేశాం. ఈ ప్రాజెక్ట్‌ నెక్ట్స్‌ లెవల్‌ కి తీసుకెళుతుందని నమ్ముతున్న. చాలా డిఫరెంట్‌ గా చేశాం. ప్రేక్షకుల తప్పకుండా ఆదరించాలి’ అని అన్నారు.

అర్జున్‌ కళ్యాణ్‌, కుషితకల్లపు చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. మంచి సినిమా అవుతుందని దర్శకుడు లక్ష్మణ వర్మ అన్నారు.