బిగ్ బాస్ 5 వ వారంలో నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లు.. ఎవరంటే?

దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో దేశంలో అన్ని భాషలలో ప్రసారమవుతూ మంచి గుర్తింపు పొందింది. తెలుగులో కూడా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తిచేసుకుని ప్రస్తుతం 6 వ సీజన్ కొనసాగుతోంది. ఇక ఆరవ సీజన్ లో కూడా ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదవ వారం కొనసాగుతోంది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షో నాలుగు వారాలలో నలుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఐదవ వారానికి సంబంధించి ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఇక 5 వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో బాలాదిత్య, చలాకీ చంటి, వాసంతి, మెరీనా అండ్ రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా, ఇనయా సుల్తానా, అర్జున్ కళ్యాణ్ 5వ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు సమాచారం.

ఇక వీరిలో ఒక కంటెస్టెంట్ ఐదవ వారంలో ఎలిమినేట్ కానుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన మొదటి వారం నుండి నాలుగు వారాలు వరుసగా ప్రతి వారంలో నామినేట్ అయిన రేవంత్ మాత్రం ఐదవ వారం నామినేషన్ ప్రక్రియలో నామినేట్ అవలేదు. అయితే చలాకి చంటి మాత్రం కెప్టెన్సీ పదవిని పొందే అర్హత కోల్పోయి ప్రతి వారం నామినేషన్స్ లో నిలబడి పరిస్థితి ఏర్పడింది.