Babu Gogineni: ఆర్‌ఆర్ఆర్‌ సినిమా పై బాబుగోగినేని ట్వీట్….జక్కన్నపై సంచలన వ్యాఖ్యలు!

Babu Gogineni: జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రాని ఇమేజ్, క్రేజ్ వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్‌లో వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని చూసి ప్రతీ ఒక్కరూ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తూ, పాత రికార్డులను బ్రేక్ చేస్తుండడం చెప్పుకోదగిన విషయం. కొన్ని చోట్ల ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూ వచ్చినా, వాటిని ఫ్యాన్స్ ఏ మాత్రం పట్టించుకోకుండా రిపీట్ మోడ్‌లో ఈ సినిమాకు వీక్షిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు . అయితే ఈ సినిమాతో చాలా కాలం తర్వాత థియేటర్లకు పూర్వ వైభవం వచ్చినట్లుగా కనిపిస్తోంది. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు. దర్శనమిస్తుండడంతో యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఆర్ఆర్ఆర్ హావా ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తారక్.. చెర్రీ నటనకు.. జక్కన్న విజువల్ ఎఫెక్ట్‏పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే తాజాగా బాబు గోగినేని (Babu Gogineni) వివాదాస్పద రివ్యూ ఇచ్చారు. దీంతో అతడిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎంతో మంది ఇంత అభిమానం కురిపిస్తున్న ఈ సినిమాపై నెగెటివ్ వేలో రివ్యూ ఇచ్చి వైరల్‌గా మారారు బాబు గోగినేని. రాజమౌళి గారు ఈ సినిమాను చాలా ఎఫర్ట్ పెట్టి తీశారని, కథ బలహీనంగానే ఉన్నా ఇందులో నటించిన నటీనటుల అద్భుతమైన నటన కారణంగానే ఈ సినిమాకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. హీరోల స్నేహ బంధంలో లాయల్టీ లేదన్న ఆయన, సూపర్ మెన్‌ల స్కిన్‌ షో తప్ప గుర్తుండిపోయే డైలాగ్ ఒక్కటి కూడా లేదని ఆయన వాపోయారు. అంతే కాకుండా కథ చాలా పూర్‌గా ఉందని, మహిళలకు కూడా అంతగా ప్రాధ్యాన్యత ఇవ్వనట్టుగా తెలుస్తోందని ఆయన చెప్పారు. ఇక కామెడీ అసలే లేదన్న ఆయన, చాలా చోట్ల లాజిక్ లేకుండా సన్నివేశాలు చిత్రీకరించారని ఆయన అన్నారు.

నాటు నాటు సాంగ్‌ చూడడానికి వినోదభరితంగానే అనిపించినా, చివర్లో వచ్చిన టైటిల్ సాంగ్‌కి మాత్రం న్యాయం చేయలేదని బాబుగోగినేని అన్నారు. ఈ పాటల ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో వీరులు ఎదుర్కొన్న సమస్యలను చూపించడంలో జక్కన్న విఫలమయ్యారని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమాలో రక్తపాతం, హింస చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన, పెద్దవాళ్లు మాత్రమే ఈ సినిమా చూడండి అంటూ ఆయన సూచించారు. కథలో తీవ్రత ఉంది కానీ పట్టు లేదని, ఇక ఈ సినిమా మొత్తాన్ని ఓకే డైరెక్టర్ తీశాడా ? అనే డౌట్ కూడా వస్తోంది అంటూ ఆయన సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంట్రవర్శియల్‌కు దారి తీసే ఈ రివ్యూను చూసిని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అద్భుతంగా సినిమా తీసిన జక్కన్నపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని వారు విరుచుకుపడుతున్నారు. ఇక ఇటీవల రాధేశ్యామ్ సినిమాకు కూడా ఇదే తరహాలో రివ్యూ ఇచ్చి, బాబుగోగినేని వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.