సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అంటే బుల్లితెర అభిమానులకు పండగే. ఈ జంటను ఏడేళ్లుగా చూస్తున్నా కూడా ఎవ్వరికీ బోర్ కొట్టడం లేదు. ఇద్దరి మధ్య ఏమీ లేదని నెత్తినోరు కొట్టుకున్నా.. వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. లేదంటూనే తెరపై రెచ్చిపోతుంటారు. తమ మధ్య ఉన్న బంధంపై ఇద్దరూ పిల్లి ఎలుకల్లా దాగుడుమూతలు ఆడుతుంటారు. ఢీ షోలో వీరిద్దరు కలిసి చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే.
ఢీ షోలో డ్యాన్సులు తక్కువ టాస్కులు, ఫన్, కౌంటర్లు, సెటైర్లు ఎక్కువన్న సంగతి తెలిసింది. ఈ మోతాడు బాబా భాస్కర్ మాస్టర్ వచ్చాక మరీ ఎక్కువైంది. శేఖర్ మాస్టర్‌కు కరోనా సోకడంతో కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకే ఆయన స్థానంలో బాబా మాస్టర్ వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ప్రతీసారి సుధీర్‌ను వేస్ట్ వేస్ట్ అంటూ ఏడిపిస్తున్న మాస్టర్.. ఈసారి మరింత రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.
బాబా భాస్కర్ పైత్యానికి ప్రతీసారి సుధీర్ మాత్రమే బలయ్యేవాడు. అయితే ఈ సారి రష్మీ కూడా కాబోతోందని తెలుస్తోంది. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలో బాబా రెచ్చిపోయాడు. టాస్క్‌లో భాగంగా రష్మీ-సుధీర్‌కు మిక్స్‌డ్ మ్యూజిక్ ఇచ్చి సిగ్నేచర్ స్టెప్పులు వేయిద్దామని ఇచ్చిన సలహాకు బాబా తలూపాడు. రష్మీకి అలవాటైనా గున్నా గున్నా మామిడి, సుధీర్ ఎంట్రీ మ్యూజిక్ స్టార్ స్టార్ అనే వాటిని మిక్స్ చేసి దంచారు. వాటికి స్టెప్పులు వేయలేక రష్మీ సుధీర్‌లు నానా తంటాలు పడ్డారు.